తెలంగాణలో కొత్తగా 2,751 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు
- August 29, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,116కు చేరాయి.కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 808కి చేరింది. తాజాగా 1675 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 89,350 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.49 శాతంగా ఉండగా.. తెలంగాణలో 74.3 శాతంగా ఉంది.కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా GHMCలో 432 నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో 185, మేడ్చల్ జిల్లాలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







