IPL నుంచి తప్పుకున్న సురేష్ రైనా
- August 29, 2020
దుబాయ్:టీం ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా IPL నుంచి తప్పుకున్నాడు.ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.సురేష్ రైనా వ్యక్తిగత కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చారని చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కె.ఎస్ విశ్వ నాథన్ తెలిపారు. అతను మిగిలిన IPL సీజన్ లో అందుబాటులో ఉండరని పేర్కొన్నారు. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ సురేష్ మరియు అతని కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తుందని అన్నారు.
IPL వచ్చే నెల 17 నుంచి జరుగుతుంది. ఈ టోర్నీ కోసం గానూ ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ చేరుకున్నాయి. నిన్న చెన్నై ఫాస్ట్ బౌలర్ ఒకరికి కరోనా వచ్చినట్టు నిర్ధారించారు. అలాగే 11 మంది స్టాఫ్ కి కూడా కరోనా సోకిందని నిర్ధారించారు. దీనితో అప్రమత్తం అయ్యాయి మిగిలిన IPL టీమ్స్ కూడా.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు