జ్లీబ్ ఫీల్డ్ క్లినిక్ ఏడాది చివరి వరకూ!
- August 29, 2020
కువైట్ సిటీ:జ్లీబ్ అల్ షుయోక్‌లో ఏర్పాటు చేయబడిన తాత్కాలిక ఫీల్డ్ క్లినిక్ ఈ ఏడాది చివరి వరకు కొనసాగనుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ యూత్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఈ క్లినిక్‌ని ఈ ఏడాది వరకు కొనసాగించేందుకు మినిస్ట్రీ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎలాంటి పాజిటివ్ కేసులూ లేకపోవడంతో ఈ కేంద్రాన్ని మూసివేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మాత్రం, దీన్ని కొనసాగించాల్సిందిగా సూచించింది. వచ్చే వింటర్ సీజన్ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్లీబ్ అల్ షుయోక్ ప్రాంత రెసిఎంట్స్కి మెడికల్ సర్వీసెస్ అందించడంలో ఈ సెంటర్ కీలక పాత్ర పోషించింది. తద్వారా అల్ ఫర్వానియా ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







