జ్లీబ్‌ ఫీల్డ్‌ క్లినిక్‌ ఏడాది చివరి వరకూ!

- August 29, 2020 , by Maagulf
జ్లీబ్‌ ఫీల్డ్‌ క్లినిక్‌ ఏడాది చివరి వరకూ!

కువైట్ సిటీ:జ్లీబ్‌ అల్‌ షుయోక్‌లో ఏర్పాటు చేయబడిన తాత్కాలిక ఫీల్డ్‌ క్లినిక్‌ ఈ ఏడాది చివరి వరకు కొనసాగనుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ యూత్‌ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ఈ క్లినిక్‌ని ఈ ఏడాది వరకు కొనసాగించేందుకు మినిస్ట్రీ అంగీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఎలాంటి పాజిటివ్‌ కేసులూ లేకపోవడంతో ఈ కేంద్రాన్ని మూసివేయాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అయితే, మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ మాత్రం, దీన్ని కొనసాగించాల్సిందిగా సూచించింది. వచ్చే వింటర్‌ సీజన్‌ ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తూ, ఈ నిర్ణయం తీసుకున్నారు. జ్లీబ్‌ అల్‌ షుయోక్‌ ప్రాంత రెసిఎంట్స్‌కి మెడికల్‌ సర్వీసెస్‌ అందించడంలో ఈ సెంటర్‌ కీలక పాత్ర పోషించింది. తద్వారా అల్‌ ఫర్వానియా ఆసుపత్రిపై ఒత్తిడి తగ్గింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com