పబ్లిక్‌ స్కూల్‌ మేటర్స్‌ కోసం ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ వినియోగించుకోవాలి

- August 29, 2020 , by Maagulf
పబ్లిక్‌ స్కూల్‌ మేటర్స్‌ కోసం ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ వినియోగించుకోవాలి

దోహా:మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, ఆన్‌లైన్‌ ద్వారా స్టూడెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌, పబ్లిక్‌ స్కూల్స్‌లో ట్రాన్స్‌ఫర్‌ వంటి సర్వీసుల్ని కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. 2020/21 ఎకడమిక్‌ ఇయర్‌కి సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా ఆయా సర్వీసులను పొందవచ్చు. మినిస్ట్రీని సంప్రదించకుండానే ఆన్‌లైన్‌ ద్వారా సేవలు అందుతాయని మినిస్ట్రీ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి పెరగకుండా తీసుకుంటోన్న చర్యల్లో భాగంగా మినిస్ట్రీకి చెందిన కార్యాలయంలో క్రౌడ్‌ తగ్గించేందుకోసం ఈ చర్యలు చేపట్టారు. ఎడ్యుకేషనల్‌ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, ఆన్‌లైన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ - గవర్నమెంట్‌ స్కూల్స్‌, ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి సర్వీసులు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో వుంటాయి. మరిన్ని వివరాల్ని మినిస్ట్రీ వెబ్‌సైట్‌ని సందర్శించి తెలుసుకోవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com