కువైట్:ఇక నుంచి ఆన్ లైన్ లో కంపెనీల లైసెన్స్ రెన్యూవల్
- August 30, 2020
కువైట్ సిటీ:కంపెనీలు, పరిశ్రమల లైసెన్స్ రెన్యూవల్, చిరునామా మార్పులకు సంబంధించి ఇక నుంచి ఆన్ లైన్ సేవలు ప్రారంభించినట్లు కువైట్ వాణిజ్య, పారిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ బిజినెస్ సెంటర్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని వివరించింది. కంపెనీ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోదలిచిన వారు ముందుగా వెబ్ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఏ తరహా కంపెనీ, సంస్థ అయితే..ఆ ఆప్షన్ లోకి వెళ్లాలి. ఆ తర్వాత లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కంపెనీ అడ్రస్ మార్చుకునే వారు, ఒక వేళ రెన్యూవల్ తో పాటు అడ్రస్ మార్చుకోవాలనుకుంటే అందుకు సంబంధించిన వివరాలు, అనుబంధ డాక్యుమెంట్లను జతచేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్ లైన్ దరఖాస్తును పరిశీలించి సబంధిత అధికారులు ఆమోదం తెలిపిన తర్వాత ఫీజు చెల్లించి లైసెన్స్ పొందవచ్చు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!