తెలంగాణలో కొత్తగా 2,924 కరోనా నమోదు పాజిటివ్ కేసులు
- August 30, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతోంది.రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,924 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,23,090కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 10 మంది మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 818కి చేరింది. తాజాగా 1,638 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు.
ఇప్పటి వరకు మొత్తంగా 90, 988 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 31,284 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 76.43 శాతంగా ఉండగా.. తెలంగాణలో 73.9 శాతంగా ఉంది. కొత్తగా వచ్చిన కేసుల్లో అత్యధికంగా GHMCలో 461 నమోదయ్యాయి. ఆ తర్వాత ఖమ్మంలో 181, కరీంనగర్ 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







