మగువ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన!
- August 30, 2020
యూనివర్సల్ డ్రీమ్స్ బ్యానర్ లో నిర్మించిన సినిమా మగువ. డిజిటల్ వరల్డ్ లో ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న చిత్రాలకు భారీ స్థాయిలో క్రేజ్ అందుతోంది. డబ్బింగ్ సినిమాలను కూడా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆడియన్స్ ఎగబడి చూస్తున్నారు. ఇక థ్రిల్లర్ వంటి సినిమాలకు హై డిమాండ్ ఏర్పడుతోంది. అలాంటి రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ ఒకటి త్వరలో విడుదల కాబోతోంది. సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల, హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి వంటి నటీనటులు నటించిన చిత్రం మగువ. ఇటీవల శ్రేయాస్ ఈటీలో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది.
యూనివర్సల్ డ్రీమ్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీరామ్
యేదోటి దర్శకుడు. సంగీతం సాబు వర్గీస్ అందించాడు. ఈ రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్ లో ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయి నైట్ డ్యూటీకి వెళుతుండగా కొందరు రేపిస్టులు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఉండే ఒక బిల్డింగ్ కు తీసుకొని వెళ్లి రేప్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ అమ్మాయి అక్కడ నుండి తెల్లారేసరికి ప్రాణాలతో బయట పడుతుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది ? కిడ్నాపర్స్ తో నైట్ అంతా ఆ అమ్మాయి ఏం చేసింది ? అసలు కిడ్నాపర్స్ ఏం అయ్యారు ? అనేది ఈ మగువ సినిమాలో అసలు పాయింట్. ఈ సినిమాలో థ్రిల్లింగ్ గా ఉండే అంశాలు చాలా ఉన్నాయి. మంచి స్క్రీన్ ప్లే తో చివరి వరకు కథ ఉత్కంఠభరితంగా జరుగుతుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీరామ్ యేదోటి మాట్లాడుతూ....
మగువ సినిమా ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. సినిమా కూడా మంచి హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇది ప్రతి ఒక్క అమ్మాయి చూడదగ్గ చిత్రం. రిలీజ్ టీజర్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
నటీనటులు:
సురేష్ బాబు, మధు ప్రియ, ప్రసన్న పుష్పమాల,హరీష్ చంద్ర, నవికేత్ పాటిల్, దేవలరాజు రవి
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: యూనివర్సల్ డ్రీమ్స్
నిర్మాతలు: పి.వెంకటేష్, కె.గణేష్, రాఘవరాజు రెడ్డయ్య, కె.సుబ్రమణ్యం.
సంగీతం: సాబు వర్గీస్
డిఓపి: ఎమ్.ఎన్.బాల
పిఆరోఒ: మధు.విఆర్
రచన, దర్శకత్వం: శ్రీరామ్ యేదోటి
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?