గృహ కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఐడీ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి:కువైట్ పీఏసీఐ

- August 31, 2020 , by Maagulf
గృహ కార్మికులకు పెండింగ్ లో ఉన్న ఐడీ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి:కువైట్ పీఏసీఐ

కువైట్ సిటీ:ఇన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న కువైట్ జాతీయ గుర్తింపు కార్డుల ప్రక్రియను పూర్తి చేసినట్లు పౌర సమాచార అధికార విభాగం డైరెక్టర్ జనరల్(పీఏసీఐ) వెల్లడించింది. ఆగస్ట్ 20 నాటికి 1,05,000 కువైట్ జాతీయ గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు వెల్లడించింది. గత వారం రోజుల్లో గృహ కార్మికులకు 26 వేల ఐడీ కార్డులను జారీ చేసినట్లు పీఏసీఐ తెలిపింది. దీంతో జులై 5 నుంచి ఇప్పటివరకు 1,15,000 ఐడీ కార్డులు జారీ చేశామని అధికారులు వివరించారు. అలాగే ప్రవాసీయులకు జులై 5 నుంచి 1,90,000 గుర్తింపు కార్డులను జారీ చేశామని..దీంతో ప్రవాసీయులకు జారీ చేసిన ఐడీ కార్డుల సంఖ్య 4,10,000 చేరినట్లు తెలిపారు. గత 40 రోజులుగా పీఏసీఐ సిబ్బంది నిర్విరామంగా కృషి చేయటం వల్లే ఇది సాధ్యమైందని, రోజుకు 12 గంటల పాటు పని చేసి పెండింగ్ కార్డుల జారీ పూర్తి చేశారని అల్ అసౌసి..పీఏసీఐ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. పెండింగ్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కావటంతో ఇక నుంచి పౌర గుర్తింపు కార్డులను కేవలం 24 గంటల్లోనే ఐడీ కార్డులను జారీ చేస్తామని, అయితే..ఇంటి అడ్రస్ లాంటి మార్పులు ఉంటే మాత్రం ఆలస్యం అవుతుందని అధికారులు వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com