దోహా:రేపటి నుంచి ఎంపిక చేసిన రూట్లలో మెట్రోలింక్ సర్వీసుల పునరుద్ధరణ

- August 31, 2020 , by Maagulf
దోహా:రేపటి నుంచి ఎంపిక చేసిన రూట్లలో మెట్రోలింక్ సర్వీసుల పునరుద్ధరణ

దోహా:ఎంపిక చేసిన 17 రూట్లలో రేపటి నుంచి మెట్రో లింక్ సర్వీసులు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రోలింక్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దోహా మెట్రో వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 6 గంటలకు, అర్ధరాత్రి 11.59 గంటల వరకు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11.50 గంటల వరకు నడుస్తాయి. దోహా మెట్రో స్టేషన్ నుంచి సమీపంలోని నివాస ప్రాంగణాలు, వాణిజ్య ప్రాంతాలకు కలుపుతూ మెట్రో లింక్ బస్సు సర్వీసులు ప్రయాణికులను గమ్యానికి చేరవేస్తాయి. 

--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com