కరోనా ఎఫెక్ట్‌: ఎయిర్‌ షో రద్దు

- August 31, 2020 , by Maagulf
కరోనా ఎఫెక్ట్‌: ఎయిర్‌ షో రద్దు

మనామా:బహ్రెయిన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ షో (బిఐఎఎస్‌) సుప్రీం ఆర్గనైజింగ్‌ కమిటీ, 2020 ఈవెంట్‌ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నిజానికి నవంబర్‌ 18 నుంచి 20 వరకు ఈ షో జరగాల్సి వుంది. అయితే, కరోనా నేపథ్యంలో ఈ ఎయిర్‌ షోని రద్దు చేస్టున్నట్లు బిఐఎఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎయిర్‌ షో రద్దు చేయడం జరిగిందనీ, ప్రపంచ దేశాల్లో కరోనా ప్రకంపనల నేపథ్యంలో డెలిగేట్స్‌, పార్టిసిపెంట్స్‌, పార్టనర్స్‌ అభిప్రాయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, 2022లో అత్యంత ప్రతిష్టాత్మకంగా షో నిర్వహిస్తామని బిఐఎఎస్‌ తెలిపింది. 2010లో తొలి ఎడిషన్‌ జరిగిందనీ, అప్పటినుంచీ ఈ షో అత్యద్భుతంగా నిర్వహిస్తూ వస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com