అబుధాబి రెస్టారెంట్‌ బ్లాస్ట్‌: ఇద్దరు మృతి

- August 31, 2020 , by Maagulf
అబుధాబి రెస్టారెంట్‌ బ్లాస్ట్‌: ఇద్దరు మృతి

అబుధాబి:అబుధాబిలోని ఓ రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్‌ సిలెండర్‌ పేలుడు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. రషీద్‌ బిన్‌ సయీద్‌ స్ట్రీట్‌ (ఎయిర్‌ పోర్ట్‌ రోడ్డులో) ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో ఓ వ్యక్తి రెస్టారెంట్‌కి చెందినవారు కాగా, మరొకరు.. అటువైపుగా వెళుతున్న వ్యక్తి. పలువురు వ్యక్తులు ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ప్రమాదంతో సమీపంలోని కొన్ని దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి. సహాయక బృందాలు అక్కడున్నవారిని హుటాహుటిన తరలించడం జరిగింది. గాయపడ్డవారికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, ఆసుపత్రికి తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com