కువైట్‌లో ఇండియన్‌ ఇంజనీర్స్‌ కోసం ఓపెన్‌ హౌస్‌

- August 31, 2020 , by Maagulf
కువైట్‌లో ఇండియన్‌ ఇంజనీర్స్‌ కోసం ఓపెన్‌ హౌస్‌

కువైట్ సిటీ:సెప్టెంబర్‌ 2న మూడవ తదుపరి ఓపెన్‌ హౌస్‌ నిర్వహించనున్నారు. కువైట్‌లో ఎంబసీ పరిసరాల్లో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ఇది ప్రారంభమవుతుంది. అఅంబాసిడర్‌, డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌, హెడ్స్‌ ఆఫ్‌ కమ్యూనిటీ వెల్ఫేర్‌, కాన్సులర్‌ మరియు లేబర్‌ వింగ్స్‌ అలాగే సంబంధిత అధికారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. కాన్సులర్‌ ఆఫీసర్‌ రోజువారీ నిర్వహించే ఓపెన్‌ హౌస్‌లకు ఇది అదనం. కువైట్‌లోని ఇండియన్‌ ఇంజనీర్స్‌ కోసం ఈ ప్రత్యేక ఓపెన్‌ హౌస్‌ నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో సంబంధిత ప్రికాషన్స్‌ అన్నీ తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఫస్ట్‌ క మ్ ఫస్ట్‌ సెర్స్‌ విధానం ద్వారా రిజిస్ట్రేషన్స్‌ చేపట్టి, ఓపెన్‌ హౌస్‌ నిర్వహిస్తారు. కమ్యూనిటీ. ఇ-మెయిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కన్ఫర్మేషన్‌ ఇ-మెయిల్‌ రిజిస్టర్డ్‌ అటెండీస్‌కి వెళుతుంది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com