ఏ.పి లో కొత్తగా 10,004 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 31, 2020
అమరావతి:ఏ.పి లో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 56,490 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 10,004 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,34,771కు చేరింది. నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 85 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నెల్లూరులో పన్నెండు, చిత్తూరులో తొమ్మిది, ప్రకాశంలో తొమ్మిది, కడపలో ఎనిమిది, అనంతపురంలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, గుంటూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు,కర్నూలులో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో నలుగురు, కృష్ణాలో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మరణించారు.
మొత్తం కరోనాతో మరణించిన వారి సంఖ్య 3969కు చేరింది. ఆదివారం 8,772 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,30,526 అయ్యింది. కాగా రాష్ట్రంలో మొత్తం 37,22,912 పరీక్షలు పూర్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం వెల్లడించింది.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







