10 కోట్లతో 20 వేల కరోనా పరీక్షలకు సిద్ధమైన బీసీసీఐ...
- September 01, 2020
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతున్న ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్యలో నిర్వహించనున్న 20,000 కి పైగా కరోనా పరీక్షల కోసం భారత క్రికెట్ బోర్డు దాదాపు 10 కోట్ల రూపాయలను బడ్జెట్లో పెట్టింది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇప్పటివరకు ఈ పరీక్షలకు ఖర్చును భరించాయి. అయితే "మేము కరోనా పరీక్షలు నిర్వహించడానికి యూఏఈ కి చెందిన విపిఎస్ హెల్త్‌కేర్ తో జతకట్టాము. ఎన్ని పరీక్షలు చేస్తాము అనేది చెప్పలేను, కానీ 20,000 లకు పైగా కరోనా పరీక్షలు మాత్రం నిర్వహిస్తాము. ఇందులో ప్రతి ఒక్క ఆటగాడు ఉంటాడు. ప్రతి పరీక్షకు మాకు 200 దిర్హామ్స్ అంటే దాదాపు 4000 రూపాయాలు ఖర్చు అవుతుంది అని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అయితే ఆటగాళ్లు ఉండే బయో-బబుల్ మరియు హోటల్ ఖర్చులను బీసీసీఐ చెల్లించడం లేదు అని కూడా చెప్పారు. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో కేవలం సిఎస్కే ఆటగాళ్లు దీపక్ చాహర్, రుతురాజ్ గైక్వాడ్‌లతో సహా 13 మంది సభ్యులు కరోనా బారిన పడటంతో వారు ఇంకా నిర్బందంలో ఉన్నారు. కానీ మిగిత అన్ని జట్లు తమ క్వారంటైన్ ను ముగించుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?