ఐపీఎల్ కు మరో షాక్..అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్ అవుట్!!
- September 02, 2020
యూఏఈ: ఈ ఏడాది ఐపీఎల్‌కు ప్రారంభం నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. మార్చిలో ప్రారంభం కావల్సిన టోర్నీ కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడింది. ఆ తరువాత ఎన్నో అడ్డంకులను దాటి బీసీసీఐ ఈ టోర్నీ నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. అయితే బాయ్ కాట్ చైనా నిరసనలతో వీవోను ప్రధాన ఫ్రాంచైజీ నుంచి తప్పించింది. ఆ తరువాత హడావుడిగా బిడ్డింగ్ నిర్వహించి సగం ధరకే డ్రీమ్11కు ఆ బాధ్య అప్పగించింది. టోర్నీ నిర్వహణకు అవరోధాలన్నీ తొలగిపోయాయనుకునే తరుణంటో బీసీసీఐకి మరో భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2020 అసోసియేట్ సెంట్రల్ స్పాన్సర్షిప్ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
‘టోర్నీ నిర్వహణకు ఖర్చు చాలా ఎక్కువ అవుతోంది. దీనిపై బీసీసీఐతో చర్చలు జరిపినా ప్రయోజనం కనపడేలేదు. అందుకే ఐపీఎల్ ఫ్రాంచైజీ నుంచి తప్పుకుంటున్నా’మని ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఓ ప్రధాన అధికారి వెల్లడించారు.
ఇదిలా ఉంటే ఫ్రాంచైజీ నుంచి ఫ్యూచర్ గ్రూప్ తప్పుకుంటున్న విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధృవీకరించారు. ఫ్యూచర్ గ్రూప్ ఫ్రాంచైజీ గడువు కూడా ముగియనుందని, కానీ ముందుగా తప్పుకొంటున్నందుకు బీసీసీఐకి ఆ కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు