పబ్జీ గేమ్ పై నిషేధం విధించిన భారత్
- September 02, 2020
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో పబ్జీతో పాటు 118 చైనా మొబైల్ యాప్స్ పై నిషేధం విధించింది. ఇటీవల టిక్ టాక్ తో పాటు చైనాకు చెందిన పలు యాపులను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గూగుల్, యాపిల్ ప్లేస్టోర్ నుంచి పబ్జీని తొలగించింది. దేశంలో పబ్జీని దాదాపు 70కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయనే కారణంతోనే నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
Ministry of Information & Technology bans PUBG and 118 other mobile applications pic.twitter.com/3bnFiaY9VW
— ANI (@ANI) September 2, 2020
తాజా వార్తలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!







