తెలంగాణలో కొత్తగా 2,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- September 03, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406కు చేరింది.కరోనా వైరస్ బాధితుల్లో కొత్తగా 10 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 856కు చేరింది. మంగళవారం ఒక్కరోజే 2611 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,00,013.
రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,537. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.09 శాతంగా ఉండగా.. రాష్ట్రంలో 74.9 శాతంగా ఉంది. భారత్‌లో మరణాల రేటు 1.75 శాతంగా ఉండగా.. తెలంగాణలో 0.64 శాతంగా ఉంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 59,711 పరీక్షలు నిర్వహించామని మొత్తం పరీక్షల 15,42,978కు చేరిందని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







