తెలంగాణ వాసికి బిల్లు మాఫీ చేసిన అల్ ధైద్ హాస్పిటల్
- September 03, 2020
యూఏఈ:యూఏఈలో తెడ్డు లక్ష్మణ్ అనే గల్ఫ్ కార్మికుడు గత ఐదు నెలల క్రితం సహాయం పొందిన 300 వందల మందిలో ఒకడు అతనికి కుడి చెయ్యి ఎదో తెలియని నొప్పితో భాదపడంతో ఎస్వీ రెడ్డి(TPCC NRI సెల్ కన్వీనర్)కి చెప్పడం జరిగింది.షార్జా పోలీస్ అకాడమీ కెప్టెన్ హుమెద్ సహాయంతో వెంటనే అల్ ధైద్ లోని అల్ ధైద్ హాస్పిటల్ కు తరలించండం జరిగింది.అక్కడ చెయ్యి కి మూడు రకాల ఆ పెరేషన్లు చేసి రెండు నెలలుగా చికిత్స చేశారు.పూర్తిగా నయం అయ్యింది కాని హాస్పిటల్ బిల్లు అన్ని డిస్కౌంట్ లు చేశాక 22,000 దిర్హామ్స్(5లక్షల రూపాయలు) అయ్యింది.ఈ డబ్బులు కడితే కాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చెయ్యరు. ఆ సమయంలో ఎస్వీ రెడ్డి హాస్పిటల్ వారికి తెడ్డు లక్ష్మణ్ పరిస్థితి వివరించంగా వాళ్ళు కనికరించి మానవతా దృక్పధంతో మొత్తం హాస్పిటల్ బిల్లు మాఫీ చేసారు.బిల్లు మాఫీ చేసినందుకు హాస్పిటల్ సిబ్బందికి ఎస్వీ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.తెడ్డు లక్ష్మన్ గత పది సంవత్సరాలుగా దుబాయ్ లో విజిట్ విసాలో వచ్చి ఇక్కడే ఉండిపోయాడు.అతని దగ్గర పాస్‌పోర్ట్ లేక ఇప్పుడు ఇండియన్ కాన్సిలిట్ సహకారంతో ఎమెర్జిన్సి పాస్‌పోర్ట్ కి అప్లై చెయ్యటం జరిగింది.గత 5 నెలలుగా తనకు సహాయసహకారాలు అందించిన ఎస్వీ రెడ్డికి తెడ్డు లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపాడు.

తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







