SBI ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌..

- September 03, 2020 , by Maagulf
SBI ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌..

'సెకండ్ ఇన్నింగ్స్ ట్యాప్' ద్వారా కొత్త వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (విఆర్ఎస్) తీసుకురావాలని ఎస్‌బీఐ నిర్ణయించినట్లు జాతీయ మీడియా ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి జనవరి వరకు మూడు నెలలు ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, 25 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి 55 సంవత్సరాలు నిండిన ఉద్యోగులు దీనికి అర్హులు అవుతారని నివేదిక పేర్కొంది. కొత్త వీఆర్‌ఎస్ ప్రణాళికకు మొత్తం 11,565 మంది అధికారులు, ఎస్‌బీఐకి చెందిన 18,625 మంది సిబ్బంది అర్హులు. ఈ స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్) ను ఎంచుకున్న వారికి వారి జీతంలో 50 శాతం ఎక్స్ గ్రేషియాగా అందిస్తారు. అర్హతగల ఉద్యోగులలో 30 శాతం మంది ఈ కొత్త పథకాన్ని ఎంచుకుంటే, బ్యాంక్ కు రూ. 2,170.85 కోట్ల మేర నికరంగా మిగులుతుంది. మార్చి 2020 నాటికి, దేశంలో అతిపెద్ద రుణదాతగా ఎస్‌బీఐ నిలుస్తుంది. దేశం మొత్తం మీద ఎస్‌బీఐ దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇదిలా ఉంటే యూనియన్లు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో సహోద్యోగులను వీఆర్ఎస్ వైపునకు మొగ్గు చూపొద్దని, విలువైన ఉద్యోగాలను, కష్టపడి పని చేసిన సొమ్మును వదులుకోవద్దని అఖిల భారత ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం సాధారణ కార్యదర్శి కేఎస్ కృష్ణ పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com