సెప్టెంబర్ 18 నుండి NS20 షూటింగ్
- September 03, 2020యంగ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి పతాకాలపై #NS20 ను ప్రముఖ నిర్మాతలు నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో బాణం పట్టుకుని వారియర్ పోజ్ లో నాగశౌర్య నిల్చొని ఉన్న స్టన్నింగ్ ఫస్ట్‌లుక్ అందరినీ థ్రిల్ చేసింది. సరికొత్తగా కనిపిస్తోన్న నాగశౌర్య లుక్ సూపర్బ్ అని అందరూ అప్రిషియేట్ చేశారు. ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రతలు తీసుకుంటూ సెప్టెంబర్ 18 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాన్ స్టాప్ గా జరుగుతుందని నిర్మాతలు తెలిపారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో నాగశౌర్య విలుకాడుగా కనిపించనున్నారు.
యంగ్ హీరో నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : రామ్‌రెడ్డి, సంగీతం: కాలబైరవ, ఎడిటర్: జునైద్, నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?