భారత్-యూఏఈ మధ్య క్రమంగా పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య

- September 04, 2020 , by Maagulf
భారత్-యూఏఈ మధ్య క్రమంగా పెరుగుతున్న విమాన ప్రయాణికుల సంఖ్య

యూఏఈ:భారత్ నుంచి యూఏఈ చేరుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో క్రమంగా పెరుగుతోంది. గత రెండు, మూడు వారాలుగా భారత్ నుంచి యూఏఈకి చేరుకుంటున్న విమానాల సర్వీసులన్ని ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా నేపథ్యంలో దాదాపు  ఆరు నెలల తర్వాత భారత్-యూఏఈ మధ్య ప్రయాణికుల రద్దీ ఈ స్థాయిలో ఇప్పుడే చూస్తున్నామని దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం సమాచార, సాంస్కృతిక విభాగం అధికారి నీరజ్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత ప్రయాణికుల రద్దీని చూస్తుంటే మెల్లి మెల్లిగా భారత్, యూఏఈ మధ్య విమాణ ప్రయాణం సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు అనిపిస్తోందని అభిప్రాయాపడ్డారు. అయితే..యూఏఈ వచ్చే ప్రవాసీయులకు గతంలో కంటే సులభంగా అనుమతి ఇస్తుండటం కూడా ప్రయాణికుల రద్దీ పెరిగేందుకు ఓ కారణం. అంతేకాదు విజిట్ వీసాదారులకు కూడా ఇంతకుముందు కంటే ఇప్పుడ సులభంగా అనుమతి లభిస్తోంది. ఇదిలాఉంటే..భారత్-యూఏఈ మధ్య విమాన సర్వీసులకు ప్రత్యేక అవగాహన కుదిరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 80 వేల మంది యూఏఈ చేరుకోవచ్చని నీరజ్ అగర్వాల్ చెప్పారు.

భారత్ నుంచి యూఏఈకి ప్రయాణికుల రద్దీ పెరిగితే..అందుకు భిన్నంగా యూఏఈ నుంచి భారత్ వెళ్లే వారి సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తోంది. సగటున రోజుకి 3,000 మంది మాత్రమే భారత్ కు వెళ్తున్నారు. దీంతో రోజుకు భారత్కు వెళ్లే భారత్, యూఏఈకి చెందిన ఎయిర్ లైన్స్ సర్వీసులలో దాదాపు 8,000 నుంచి 9,000 వరకు సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అంతేకాదు..భారత్ వెళ్లేందుకు ముందుగా రిజిస్టర్ చేసుకున్న వారు కూడా తమ నిర్ణయం మార్చుకుంటున్నారు. అన్ లాక్ ప్రక్రియతో మళ్లీ పర్యాటక రంగం, హోటల్స్, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరుచుకుంటుండటంతో భారత్కు రావాలని గతంలో అనుకున్నవారు కూడా ఇఫ్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. అదే సమయంలో ఇండియాలోనూ కరోనా తీవ్రత పెరుగుతుండటం, క్వారంటైన్ నిబంధనలు కూడా భారత్ రావాలనుకుంటున్న ప్రవాసీయులపై ప్రభావం చూపుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com