ప్రెజర్ కుక్కర్లో బంగారం స్మగ్గ్లింగ్
- September 05, 2020
కేరళ:బంగారం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన పక్కాదారిలో తరలిస్తూనే ఉన్నారు. ఎన్ని మార్గాలు మూసి వేసిన కొత్తదారిలో బంగారాన్ని అక్రమంగా తీసుకువస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రం కొద్డిరోజులుగా బంగారం అక్రమ రవాణాతో రోజు వార్తల్లోకి ఎక్కుతుంది. తాజాగా కేరళ విమానాశ్రయంలో అక్రమంగా బంగారం తరలిస్తున్నవ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జెడ్డా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి నుంచి సుమారు 700 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు.ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన అధికారులు అతన్ని పట్టుకున్నారు. ప్రెజర్ కుక్కర్లో బంగారన్ని తీసుకు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు