కువైట్: విదేశాల్లో చిక్కుకుపోయిన వలసదారులకు వేతనాల్లేవ్
- September 05, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన ఉద్యోగులకు, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ‘అబ్జెంట్’గా పరిగణించడం జరుగుతుందనీ, వారికి వేతనాలు చెల్లించబడవని కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. మొత్తం 32 దేశాల నుంచి వచ్చే విమానాలపై కువైట్ బ్యాన్ విధించిన విషయం విదితమే. మార్చి 12కి ముందు రెగ్యులర్ హాలీడేస్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు వెళ్ళిన వలసదారులకు, ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో సెలవులు ప్రకటించిన విషయం విదితమే. ప్రభుత్వం జారీ చేసిన సెలవులకు సంబంధించి జీతాల చెల్లింపు జరుగుతుంది. కాగా, వైరస్ సంబంధిత రిస్ట్రక్షన్స్ నుంచి ఇటీవల కొన్ని సడలింపులు ఇవ్వడం జరిగింది. తద్వారా తిరిగి వర్క్‌లో చేరడానికి ఆస్కారం కల్పించారు. ట్రావెల్ సమస్యల కారణంగా ఉద్యోగులు తిరిగి కువైట్‌కి రాలేని పక్షంలో, వారికి ‘నో పెయిడ్’ లీవ్‌గా పరిగణిస్తారు. అయితే, వారికి ఇంకా సెలవులు వున్నట్లయితే, వాటి నుంచి మినహాయించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు