ఎపిలో 2 వీలర్ , 4 వీలర్స్ పై టాక్స్ పెంపు
- September 05, 2020
అమరావతి: ఎపిలో రవాణ శాఖలో పన్నులు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2 వీలర్, 4 వీలర్స్ పై విధించే లైఫ్ ట్యాక్స్ పెంచాలని రవాణ శాఖ చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపినట్టుసమాచారం. పన్నుల పెంపు ప్రతిపాదనల ద్వారా అదనంగా రూ.400 కోట్లు వస్తాయని రవాణా శాఖ అంచనా వేస్తోంది. 2 వీలర్, 4 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ రెండు రకాల శ్లాబుల్లో 1 నుంచి 3 శాతం మేర పెంపు ఉండేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. 50 వేలలోపు ధర కలిగిన 2 వీలర్స్ ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్స్ చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేసినట్టు తెలుస్తోంది. 2 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా 174 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా. 8 లక్షల్లోపు ధర కలిగిన 4 వీలర్స్ ఆ పై ధర ఉన్న వాహానాలకు రెండు శ్లాబుల్లో లైఫ్ ట్యాక్సు చెల్లింపులు చేసేలా ప్రతిపాదనలు చేశారు. 4 వీలర్స్ పై లైఫ్ ట్యాక్స్ పెంచడం ద్వారా అదనంగా సుమారు రూ.140 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ వాహానాలకు విధించే గ్రీన్ ట్యాక్స్ రేట్ల పెంపు ద్వారా అదనంగా రూ.30 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్ పెంపు నుంచి ఆటోలకు మినహాయింపు ఇచ్చినట్టు సమాచారం..
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన