తెలంగాణ:సీనియర్ ఆఫీసర్లతో భేటీ అయిన మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

- September 05, 2020 , by Maagulf
తెలంగాణ:సీనియర్ ఆఫీసర్లతో భేటీ అయిన మంత్రి మహ్మద్ మహమూద్ అలీ

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ,రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  అగ్నిమాపక సేవల విభాగం నుండి కళాశాలలకు ఎన్‌ఓసి జారీ చేయాల్సిన సమస్య మరియు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై  సీనియర్ ఆఫీసర్లతో కలిసి హోంమంత్రి కార్యాలయంలో శనివారం నాడు సమావేశమయ్యారు.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పరిధిలోని కళాశాలలకు అనుమతిని ఇవ్వడం మరియు లక్షలాది ఇంటర్మీడియట్ విద్యార్థులపై ప్రభావం చూపే సమస్యను పరిష్కరించడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ….. ప్రజల ప్రాణాలను మరియు ఆస్తిని అగ్ని ప్రమాదాల నుండి రక్షించ డానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరియు వారి భద్రత కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామ న్నారు.  కోవిడ్ -19 ప్రభావం ఉన్న ఈ అసాధారణ సంవత్సరంలో విద్యార్తుల భవిష్యత్తును పరిగణనలోకి తీసుకునేనందుకు చట్టం మరియు నిబంధనలకు అనుగుణంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని నిర్ణయించారు.  విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్ర రెడ్డి మాట్లాడుతూ హోంశాఖ అధికారులు ఈ సమస్యను జాగ్రత్తగా పరిశీలిస్తారని, అసాధారణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరిష్కారాన్ని సూచిస్తారని చెప్పారు.ఈ విషయాన్ని వివరంగా పరిశీలిస్తామని, తదనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు.చిత్రా రాంచంద్రన్  స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రవి గుప్తా,ముఖ్య కార్యదర్శి,హోమ్ డిపార్ట్మెంట్, సంజయ్ కుమార్ జైన్, డిజి ఫైర్ సర్వీసెస్, సయ్యద్ ఒమర్ జలీల్ కమిషనర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, విశ్వజిత్ కంపాతి, డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్, జీహెచ్‌ఎంసీ  తదితరులు ఈసమావేశంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com