ఎన్ టీ ఆర్ ని 10వ తరగతి పాఠ్యాంశంగా చేర్చినందుకు కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ

- September 05, 2020 , by Maagulf
ఎన్ టీ ఆర్ ని 10వ తరగతి పాఠ్యాంశంగా చేర్చినందుకు కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ

హైదరాబాద్:కళకి, కళాకారులకి విలువను పెంచిన కధానాయకుడు,  తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠాన్ని కదలించేలా వినిపించిన మహానాయకుడు, ఎన్నో సాహసోపేతమైన ప్రజారంజక నిర్ణయాలతో ప్రజల ముంగిటకే ప్రభుత్వాన్ని తెచ్చిన ప్రజానాయకుడు, మదరాసీయులమనే పేరుని చెరిపి భారతదేశపటంలో తెలుగువాడికి, తెలుగు వేడికి ఒక ప్రత్యేకతని తెచ్చిన తెలుగుజాతి ముద్దు బిడ్డ ,అన్నగారు, మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారి గురించి భావి తరాలకి స్ఫూర్తినిచ్చేలా 10వ తరగతి సాంఘిక శాస్త్ర పుస్తకం లో పాఠ్యాంశముగా చేర్చిన తెలంగాణా ప్రభుత్వానికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

--నందమూరి బాలకృష్ణ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com