అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్..
- September 07, 2020
అమరావతి:కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
- సెప్టెంబర్ 21 నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు అనుమతి.
- ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి.
- సెప్టెంబర్ 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మతపరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతి.
- సెప్టెంబర్ 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది అతిథులతో అనుమతి, అంతక్రియలకు 20 మందికి అనుమతి
- సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు అనుమతి నిరాకరణ
- ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







