సౌదీ:కరోనా తీవ్రత తగ్గిన తర్వాతే అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ
- September 10, 2020
రియాద్:అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కరోనా వ్యాప్తి తీవ్రత నియంత్రణ పరిస్థితులను బట్టే అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామని సౌదీ అరేబియా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. తమకు ప్రజల ఆరోగ్య సంరక్షణ ముఖ్యమని వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకు ఇప్పుడప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కింగ్డమ్ లో ఇంకా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయని ఆయన అన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించుకొని రాజు సల్మాన్ సూచనల మేరకు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఇదిలాఉంటే లాక్ డౌన్ తో గత మార్చి 15 నుంచి సౌదీ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాలను రద్దు చేసింది. అంతర్జాతీయ విమానాలు రద్దు కావటంతో పలు దేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసీయులు ఇప్పటికీ సౌదీకి చేరుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు దేశాల్లో ఉండిపోయిన సౌదీ ప్రవాసీయుల వీసా, రెసిడెన్సీ పర్మిట్ ను మరికొంత కాలం పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







