'మేముసైతం' కోసం 'ముఠామేస్త్రీ' గా మారిన రాణా

- February 10, 2016 , by Maagulf
'మేముసైతం'  కోసం 'ముఠామేస్త్రీ' గా మారిన రాణా

నటుడు దగ్గుబాటి రానా ముఠామేస్త్రీ అయ్యారు. మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారం కానున్న 'మేముసైతం' అనే కార్యక్రమం కోసం రానా బుధవారం కూలీగా మూటలు మోశారు. కూకట్‌పల్లిలోని రైతుబజార్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కూలీ గెటప్‌లో మూటలు మోశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మి తన ట్విట్టర్‌ ఖాతాలో రానాకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్‌ చేశారు. దీనికి స్పందించిన రానా ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఇటీవల ఈ కార్యక్రమం కోసం నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూరగాయలు అమ్మిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com