ఏపీ:కరోనాతో టీడీపీ సీనియర్ నేత మృతి
- September 11, 2020
ఏపీ:టీడీపీని మరో విషాదం వెంటాడింది. పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు కన్నుమూశారు. కరోనాతో ఆయన చనిపోయినట్లు తెలుస్తోంది. గత పది రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రామాంజనేయులు చికిత్స పొందుతుండగా.. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో.. శుక్రవారం ఉదయం ఐదు గంటలకు తుదిశ్వాస విడిచారు. రామాంజనేయులు స్వస్థలం కలిదిండి మండలం అవ్వకూరు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర మరియు లక్ష్మి పతి,సుదర్శన్,తులసి కుమార్,రవి కుమార్,ప్రసాద్,తులసి ప్రసాద్,సుధాకర్,అప్పాజీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు