ట్రాఫిక్‌ చట్టం ఉల్లంఘన: మోటరిస్ట్‌ అరెస్ట్‌

- September 11, 2020 , by Maagulf
ట్రాఫిక్‌ చట్టం ఉల్లంఘన: మోటరిస్ట్‌ అరెస్ట్‌

మస్కట్‌: ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడుతూ, దాన్ని వీడియోగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో వుంచిన ఓ వాహనదారుడ్ని అరెస్ట్‌ చేశారు. సౌత్‌ అల్‌ బతినా గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, నిందితుడ్ని అరెస్ట్‌ చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగేలా ఆ వ్యక్తి వాహనాన్ని నడిపినట్లు అధికారులు పేర్కొన్నారు. వాహనదారుడు తన వాహనాన్ని ప్రమాదకర రీతిలో రోడ్డుపై నిలుపుదల చేసినట్లు అధికారులు వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com