బహ్రెయిన్: చెప్పా పెట్టకుండా పని మానేస్తా ఫ్లెక్సీ పర్మిట్ కు అవకాశమే లేదు

- September 11, 2020 , by Maagulf
బహ్రెయిన్: చెప్పా పెట్టకుండా పని మానేస్తా ఫ్లెక్సీ పర్మిట్ కు అవకాశమే లేదు

మనామా:చెప్పాపెట్టకుండా పని మానేసే(పారిపోయిన) కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లెక్సీ పర్మిట్ ఇచ్చే అవకాశమే లేదని బహ్రెయిన్ కార్మిక నియంత్రణ అధికార విభాగం తేల్చి చెప్పేసింది. అంతేకాదు..అలాంటి కార్మికులు వేరే చోట పని చేసేందుకు కూడా అవకాశం ఉండదని స్పష్టం చేసింది. కొత్త యాజమాని దగ్గర పని కుదిరేందుకు అవసరమైన ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ కూడా ఇవ్వబోమని ప్రకటించింది. అంటే..ఒకవేళ ప్రవాస కార్మికుడు యజమాని అనుమతి లేకుండా పని మానేస్తే వారికి మరో ఉపాధి అవకాశం లేకుండా పోతుంది. ఇక వాళ్లు దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి తప్ప మరో మార్గం ఉండదు. ప్రస్తుతం కింగ్డమ్ పరిధిలో చెప్పాపెట్టకుండా పని మానేసిన(పారిపోయిన) కార్మికుల సంఖ్య మొత్తం ప్రవాస కార్మికుల సంఖ్యలో 0.4 శాతం లోపే ఉందని కూడా ఎల్ఎమ్ఆర్ఏ వెల్లడించింది. ఒక వేళ ఎవరైన కార్మికుడు ఎలాంటి సమాచారం లేకుండా 15 రోజులు అంతకుమించి విధులకు హజరుకాకుంటే..ఆ విషయాన్ని అధికారులకు నివేదించాలని ఎల్ఎమ్ఆర్ఏ యజమానులకు సూచించింది. యజమాని రిపోర్ట్ ను ఎల్ఎమ్ఆర్ఏ నిర్ధారించుకున్న తర్వాత ఇక సదరు కార్మికుడు ట్రాన్స్ ఫర్ రిక్వెస్ట్ చేసుకోవటానికిగానీ, అదే యజమాని దగ్గర మళ్లీ చేసుకునేందుకు అనుమతి కోరుతూ రిక్వెస్ట్ చేసుకునేందుకు పూర్తిగా అనర్హుడు అవుతాడు. దీంతో ఆ కార్మికుడికి ఫ్లెక్సీ పర్మిట్ అవకాశం లేకుండా పోతుంది. 

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com