ఇండియన్ ఎంబసీ - టీచర్లకు సన్మానం
- September 11, 2020
దోహా:ఖతార్‌లో భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్, పలువురు భారతీయ టీచర్లను సత్కరించారు. కమ్యూనిటీ బిల్డింగ్, ఎకనమిక్ ఎక్స్‌లెన్స్, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంటల్ ప్రిజర్వేషన్ వంటి అంశాల్లో తమవంతు పాత్ర పోషిస్తోన్న టీచర్లను ఇండియన్ ఎంబసీ - టీచర్స్ ఫెలిసిటేషన్ సెర్మనీ సందర్భంగా సత్కరించడం జరిగింది. యూ ట్యూబ్‌లో ఈ కార్యక్రమం లైవ్‌లో ప్రసారమైంది. ఈ సందర్భంగా రాయబారి దీపక్ మిట్టల్, ఉపాధ్యాయుల సేవల్ని కొనియాడారు. బిర్లా పబ్లిక్ స్కూల్‌కి చెందిన రాకేష& వర్మ, డిపిఎస్ మోడర్న్ ఇండియన్ స్కూల్‌కి చెందిన జయంతి రాజగోపాలన్, శాంతినికేతన్ ఇండియన్ స్కూల్‌కి చెందిన షాకిర్ హుస్సేన్‌లను ఈ సందర్భంగా సత్కరించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇండియన్ స్కూల్స్‌లో పాటించేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ కంటే గొప్ప మిత్రుడు, రీడింగ్ కంటే గొప్ప ఆనందం ఏదీ వుండదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని గుర్తు చేశారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?