ప్రజలలో భయాన్ని కల్గిస్తూ పుకార్ల ఫోన్లు చేసేవారిపై తీవ్ర చర్యలు
- February 10, 2016
బహ్రెయిన్ లో ప్రజాజీవన క్రమాన్ని అంతరాయం కల్గిస్తూ, లేనిపోని పుకార్లను అవాస్తవాలను ఫోన్ కాల్స్ ద్వారా తెలియచేస్తూ భయాన్ని కల్గించే వారిపై పోలీసులు చట్టపరమైన కటినచర్యలు తీసుకోనున్నారు. నేషనల్ ఏక్షన్ చార్టర్ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రజాభద్రతా విభాగం ముఖ్యాఢికారి మేజర్ జనెరల్ తారిక్ అల్ హస్సన్ ఈ ప్రకటనను చేశారు. సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి దేశస్థిరత్వాన్ని కలవరపరచే వ్యక్తులపై వారి ఫొనె పుకార్లను ఉపెక్షెంచబొమని అన్నారు.బహ్రెయిన్ పోలీసులు ఇప్పటికే..వివిధ ఫోన్ కాల్స్ పై పర్యవేక్షణ జరుపుతున్నారని తెలిపారు. వారు ప్రజాభద్రతపై అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి పుకార్లను వ్యాపింప చేసేవారి గూర్చిన ఏదైనా ముఖ్య సమాచారం ప్రజలలో ఎవరి దగ్గరైనా ఉంటె, వారు ఆ వ్యక్తిని గూర్చి ఈ దిగువన ఇస్తున్న " 80008008 " ఫొనె నెంబర్ కు తప్పక తెలియచేయాలని...అయెతే, ఈ సమాచారం ఇచ్చినవారి వివరాలను పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







