యూఏఈ అధ్యక్షతన సమావేశమైన జీసీసీ దేశాల ట్రాఫిక్ విభాగాలు

- September 11, 2020 , by Maagulf
యూఏఈ అధ్యక్షతన సమావేశమైన జీసీసీ దేశాల ట్రాఫిక్ విభాగాలు

యూఏఈ:గల్ఫ్ సహాకార మండలి సభ్య దేశాల్లో ట్రాఫిక్ సెఫ్టీకి సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక అమలుపై ఆయా సభ్యదేశాల ట్రాఫిక్ డీజీలు చర్చించారు. యూఏఈ అధ్యక్షతన జరిగిన 36వ సమావేశంలో పాల్గొన్న డీజీలు...ట్రాఫిక్ సమస్యలు, మెరుగైన సేవలకు సంబంధించి గల్ఫ్ దేశాల మధ్య పరస్పర సహాకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన చర్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా ప్రస్తుత కరోనా నేపథ్యంలో తమ ట్రాఫిక్ విభాగానికి సంబంధించి వైరస్ విస్తరించకుండా ఎలాంటి మార్గాలను అవలంభించాలనేది డిస్కస్ చేశారు. జీసీసీ దేశాలు పరస్పర సంబంధాలను మరింత మెరుగుపరుకోవటం, పలు వైపుల నుంచి వస్తున్న సరైన సలహాలను అమలు చేయటం ద్వారా జీసీసీ దేశాధినేతలు, ప్రజల అకాంక్షలను అందుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇందుకు జీసీసీ దేశాల అన్ని ట్రాఫిక్ విభాగాలకు సంబంధించి యూనిఫైడ్ ఎలక్ట్రానిక్ పోర్టల్ ద్వారా ఏకీకృత డేటా బేస్ సమాచారాన్ని సభ్య దేశాలు పరస్పరం పంచుకోవాలని, ఏకీకృత డేటా బేస్ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘన కేసులను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొవచ్చని సమావేశంలో పాల్గొన్న ట్రాఫిక్ అధికారులు అభిప్రాయపడ్డారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com