ఖతార్ లో కొత్తగా 235 కరోనా కేసులు..వైరస్ నుంచి 211 మంది రికవరి
- September 11, 2020
దోహా:ఖతార్ లో కోవిడ్ 19 తీవ్రత కొనసాగుతోంది. ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం సుల్తానేట్ లో కొత్తగా 235 మందికి కరోనా వైరస్ సోకింది. ఇందులో 8 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా బారిన వారి సంఖ్య 1,21,287కి చేరింది. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. 24 గంటల్లో మరో 211 మంది వైరస్ నుంచి పూర్తిగా రికవరి అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు 1,21,287 మందికి వైరస్ సోకితే 1,18,199 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక సుల్తానేట్ పరిధిలో ప్రస్తుతం 2883 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇందులో 50 మందికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ ప్రబలిన నాటి నుంచి ఇప్పటివరకు 205 మంది మరణించారు. ఇదిలాఉంటే..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణకు విధించిన ఆంక్షలను క్రమంగా సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, జనసమర్ధ ప్రాంతాల్లో ఉండకూడదని సూచించారు. ఫేస్ మాస్క్ ధరించటంతో పాటు తరచుగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







