భారత్ కరోనా కేసుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకునే అవకాశం
- September 12, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. వరుసగా రెండోరోజు రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదయ్యాయి. 24 గంటల్లో 95వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. ఈ సమయంలో 12 వందల మంది మృతిచెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45 లక్షలకు చేరింది. మరణాలు రేటు 1.67కు పడిపోయిందని.. రికవరీ రేటు 77.65కు పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు మృతుల సంఖ్య దేశంలో 75వేలు దాటింది. కొత్త కేసుల్లో 57 శాతం మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లోనే నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కరోనా హాట్ స్పాట్‌గా ఉన్న మహారాష్ట్రలో బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరింది. కరోనా కేసుల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న రష్యాతో పోటీపడుతోంది. అక్టోబర్ మొదటి వారానికి భారత్‌లో కేసులు 70 లక్షలు దాటుతాయని.. బాధితుల సంఖ్య అమెరికాను దాటేసి ప్రపంచంలోనే మొదటి స్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్ బిట్స్ పిలానీ పరిశోధకులు పేర్కొన్నారు. భారత్‌లో కరోనా వ్యాప్తి తీరుపై ఆ బృందం అధ్యయనం చేసింది. నిర్వహించే పరీక్షల సంఖ్య ఆధారంగా కేసుల తీరు ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు