ఇజ్రాయెల్‌తో బహ్రెయిన్ సన్నిహిత సంబంధాలు
- September 12, 2020
మనామా:ఇజ్రాయెల్‌తో సన్నిహిత సంబంధాలకు సంబంధించి బహ్రెయిన్ కూడా కీలకమైన ముందడుగు వేయనుంది. అమెరికా అఫధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచన మేరకు యూఏఈ ఇప్పటికే, ఇజ్రాయెల్‌తో చారిత్రక ఒప్పందాలు కుదుర్చుకున్న విషయం విదితమే. తాజాగా బహ్రెయిన్ కూడా ఆ కోవలో చేరనుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహా, బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఒకేసారి ఫోన్‌లో మాట్లాడారు డోనాల్డ్ ట్రంప్. ఈ సందర్భంగా ఓ ఒప్పందం మూడు దేశాల మధ్యా కుదిరింది. ఈ క్రమంలో ట్రంప్ మరో డిప్లమాటిక్ విక్టరీని నమోదు చేసినట్లయ్యింది. సెప్టెంబర్ 11, 2001న అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై తీవ్రవాద దాడి జరిగిన 19 ఏళ్ళ తర్వాత.. అదే రోజున ట్రంప్ చారిత్రక విజయాన్ని సాధించారు బహ్రెయిన్ - ఇజ్రాయెల్ మధ్య సన్నిహిత సంబంధాలను నెలకొల్పడం ద్వారా.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







