మెడికల్ చెకప్ కోసం విదేశాలకు సోనియా,రాహుల్!
- September 12, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ హెల్త్ టెస్టుల నిమిత్తం శనివారం సాయంత్రం విదేశాలకు బయలుదేరినట్టు తెలుస్తోంది. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సోనియాగాంధీ గైర్హాజరయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. సోనియా వెంట రాహుల్ గాంధీ కూడా ఫారెన్ వెళ్లారు. కానీ రాహుల్ వచ్చే వీకెండ్ తిరిగి ఇండియాకు వచ్చేస్తారని తెలుస్తోంది. రాహుల్ తిరిగి వచ్చిన అనంతరం పార్లమెంటు సమావేశాల్లో పాల్గొననున్నారు. సోనియా మాత్రం ఫస్ట్ ఫేజ్ సమావేశాలకు పూర్తిగా గైర్హాజరవుతారని కాంగ్రెస్ వర్గాల సమాచారం.
గత కొద్ది సంవత్సరాలుగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జులై 30న ఆమె ఢిల్లీలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చేరారు. నార్మల్ టెస్టులు చేయించుకుని కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
తాజా వార్తలు
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!







