దుబాయ్ లో నిజాయితీ చాటిన భార‌తీయుడు..

- September 13, 2020 , by Maagulf
దుబాయ్ లో నిజాయితీ చాటిన భార‌తీయుడు..

దుబాయ్:దుబాయ్ లో ప్ర‌వాస భార‌తీయుడి ఒక‌రు త‌న నిజాయితీని చాటారు.త‌న‌కు దొరికిన బ్యాగులో 14,000$ డాలర్ల న‌గ‌దు మరియు 200,000 దిర్హాముల విలువ చేసే బంగారు ఆభ‌ర‌ణాలను భార‌త వ్య‌క్తి తీసుకెళ్లి దుబాయ్ పోలీసుల‌కు అప్ప‌గించారు.భార‌త్‌కు చెందిన రిచ్ జేమ్స్ క‌మ‌ల్ కుమార్ త‌న నిజాయితీని చాటుకున్నారు.త‌న‌కు దొరికిన లక్ష‌ల రూపాయలు క‌లిగి ఉన్న‌ బ్యాగును అల్ కుశైస్ పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించారు.ఎంతో నిజాయితీగా త‌న‌కు దొరికిన బ్యాగును తెచ్చి పోలీస్ స్టేష‌న్‌లో అప్ప‌గించినందుకు శ‌నివారం ఆయ‌న‌ను అల్ కుశైస్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ యూసుఫ్ అబ్దుల్లాహ్ సలీమ్ అల్ అదిది స‌న్మానించారు.ఈ సంధర్భంగా కుమార్‌కు పోలీస్ అధికారులు ప్ర‌త్యేక ప్ర‌శంస ప‌త్రాన్ని అంద‌జేశారు.త‌న‌కు ద‌క్కిన ఈ ప్ర‌త్యేక గుర్తింపు ప‌ట్ల‌ దుబాయ్ పోలీసులకు క‌మ‌ల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది తనకు గర్వకారణమని అన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com