గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కంగనా

- September 13, 2020 , by Maagulf
గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన కంగనా

ముంబై : మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారితో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ భేటీ అయ్యారు. అకారణంగా తన కార్యాలయాన్నికూల్చివేయడంపై గవర్నర్‌కు కంగనా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వీరి భేటీ దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే వీడియో కాన్ఫరెన్స్‌ జరిగిన రెండు గంటల తర్వాత వీరి భేటీ జరుగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.

ముంబైలోని తన కార్యాలయం కూల్చివేసిన నాలుగు రోజుల తరువాత కంగనా రనోత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలుసుకున్నారు. ఆమెతో పాటు సోదరి రంగోలి కూడా భేటీలో పాల్గొన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం.. గవర్నర్‌ను కలుసుకోవడానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. నాకు జరిగిన అన్యాయం గురించి, మహారాష్ట్ర ప్రభుత్వ అవమానం గురించి మాత్రమే గవర్నర్‌తో మాట్లాడానని చెప్పారు. ఈ కేసులో తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు కంగనా పేర్కొన్నారు.

ముంబైలోని పాలి హిల్‌లోని మణికర్నిక ఫిల్మ్స్ కార్యాలయాన్ని సెప్టెంబర్ 9 న బీఎంసీ అధికారులు రెండు గంటలపాటు కూల్చివేతలు చేపట్టారు. ఈ చర్యకు వ్యతిరేకంగా కంగనా హైకోర్టుకు వెళ్లడంతో బీఎంసీ తమ చర్యలను నిలిపివేసింది. ముంబై నగరంలోని అక్రమ నిర్మాణాలపై ఇంత కఠిన చర్యలు చూపిస్తే ముంబై మరోలా ఉండేదని బొంబాయి హైకోర్టు వ్యాఖ్యానించింది. తన కార్యాలయాన్ని కూల్చివేసిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా రనౌత్‌ మాటల దాడి చేస్తూనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com