జపాన్ నూతన ప్రధానిగా యోషిహిడే సుగా
- September 15, 2020
టోక్యో:జపాన్ అధికార పార్టీకి నూతన రధసారథిగా యోషిహిడే సుగాను ఎన్నికయ్యారు. అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో 377 ఓట్లు సాధించిన సుగాను కాబోయే జపాన్ ప్రధానమంత్రిగా ప్రకటించింది. దీంతో జపాన్ క్యాబినెట్ ముఖ్య కార్యదర్శి యోషిహిడే సుగా దేశ తదుపరి ప్రధానిగా అవతరించనున్నారు. లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డిపి) చట్టసభ సభ్యులు , ప్రాంతీయ ప్రతినిధులు వేసిన 534 చెల్లుబాటు అయ్యే ఓట్లలో 377 ని సాధించి, సుగా తన ఇద్దరు ప్రత్యర్థుల కంటే గణనీయంగా ముందువరుసలో నిలిచారు. ఉత్తర జపాన్ లోని గ్రామీణ అకిటాలో స్ట్రాబెర్రీ రైతు కుమారుడైన సుగా.. అక్కడ హైస్కూల్ విద్య అనంతరం టోక్యోకు వెళ్లారు.. అనంతరం నైట్ కాలేజీలో కాలేజీ విద్య పూర్తి చేశారు. ఆ తరువాత టోక్యో లోని యోకోహామాలో మునిసిపల్ అసెంబ్లీ సభ్యుడిగా 1987లో ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం ప్రధాని పదవిని అధిరోహించనున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం