3.2 మిలియన్ దిర్హామ్ విలువైన ఫేక్ ప్రోడక్ట్స్ రీసైకిల్
- September 15, 2020
దుబాయ్:దుబాయ్ కస్టమ్స్, 3.2 మిలియన్ దిర్హామ్ విలువైన కౌంటర్‌ఫీట్ ప్రోడక్ట్స్‌ని 2020లో ఇప్పటిదాకా రీసైకిల్ చేయడం జరిగింది. 46 అంతర్జాతీయ బ్రాండ్స్‌కి సంబంధించి 148,700 ఫేక్స్‌ని రీసైకిల్ చేశారు. ధ్వంసం చేయడానికి బదులుగా వీటిని రీసైకిల్ చేయడం జరిగిందని డైరెక్టర్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డిపార్ట్‌మెంట్ యూసెఫ్ ఒజైర్ ముబారక్ పేర్కొన్నారు. ఫ్రెంచ్ అలాగే యూఎస్ డిప్లమాటిక్ మిషన్స్‌తో జరిగిన వీడియో మీటింగ్ సందర్భభంగా ఈ విషయాన్ని వెల్లడించారు. కౌంటర్‌ఫీట్ ప్రోడక్ట్స్ విషయమై ఈ మీటింగ్‌లో చర్చ జరిగింది. అంతర్జాతీయ బ్రాండ్స్ హక్కుల విషయమై ఐపీఆర్ డిపార్ట్‌మెంట్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముబారక్ చెప్పారు. పూర్తిగా ఆయా ప్రోడక్ట్స్‌ని ధ్వంసం చేయడం కంటే వాటిని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రీసైకిల్ చేసేముందు ట్రేడ్ మార్క్ ఓనర్స్‌కి సమాచారం ఇస్తారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







