కింగ్ ఫహాద్ కాజ్‌వే ఇ-పేమెంట్ ప్రారంభం
- September 15, 2020
సౌదీ అరేబియా:కింగ్ ఫహాద్ కాజ్‌వేపై ఎలక్ట్రానిక్ పేమెంట్ నేటి నుంచి ప్రారంభమయ్యింది. ఇ-పేమెంట్ విధానం, కార్లు అలాగే ట్రక్కులు మరియో మోటర్ సైకిల్స్‌కి వర్తిస్తుందనీ, క్యాష్ రూపంలో చెల్లింపులు చేయకుండానే ఈ కాజ్‌వేని వినియోగించుకోవచ్చని కింగ్ ఫహాద్ కాజ్‌వే అథారిటీ పేర్కొంది. మెంబర్‌షిప్ కార్డులు కలిగినవారు కెఎఫ్‌సిఎ అధికారిక వెబ్‌సైట్‌లో రీచార్జ్ చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన గేట్స్ కూడా స్టాఫ్‌తో సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా పనిచేస్తాయి. కాగా, కొత్త గేట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తవుతుంది. ఆటోమేటిక్ వెయింగ్ కి సంబంధించి దీన్ని ఉపయోగించనున్నారు. మార్చి 7న ఈ 25 కిలోమీటర్ల కాజ్‌వే కరోనా నేపథ్యంలో మూసివేయడం జరిగింది. కాగా, జులైలో ఈ కాజ్‌వేని తెరిచారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







