కువైట్:ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు ఉన్న వారు కూడా ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలన్న ఎంబసీ
- September 16, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు చేపట్టిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్నట్లు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. భారత్ వెళ్లేందుకు రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కర్ని తాము సంప్రదిస్తున్నామని తెలిపింది. వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రవాస భారతీయులను ఇండియా చేరుస్తున్న విషయం తెలిసిందే. అయితే..విమాన ప్రయాణానికి అవసరమైన డాక్యుమెంట్లు లేని వారి కోసం ఎమర్జెన్సీ సర్టిఫికెట్లను జారీ చేస్తోంది. అయితే..స్వదేశానికి వెళ్లాలనుకుంటున్న భారతీయులందర్ని సజావుగా సొంత ప్రాంతాలకు చేర్చేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ డ్రైవ్ ను మరికొంత కాలం పొడిగించాలని రాయబార కార్యాలయం నిర్ణయించింది. అలాగే ఇప్పటికే ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు పొందినవారు కూడా ప్రయాణానికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే..ప్రయాణానికి సంబంధించి ఇప్పటివరకు సరైన డాక్యుమెంట్లు లేనివారితో పాటు..ఎమర్జెన్సీ సర్టిఫికెట్లు పొందిన వారు కూడా ఎంబసీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్న వారు https://forms.gle/pMf6kBxix4DYhzxz7 లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. లేదంటే రాయబార కార్యాలయం హాల్ లో ఏర్పాటు చేసిన బాక్సులలో దరఖాస్తులను వేయాలి. షార్క్, జలీబ్ అల్ షువైఖ్, ఫహహీల్ లోని భారత పాస్ పోర్ట్ కేంద్రాల్లో కూడా దరఖాస్తులను స్వీకరిస్తారు. రిజిస్టర్ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. ప్రయాణ డాక్యుమెంట్ల జారీ సమయంలో మాత్రం ఎంబసీ కౌంటర్ల దగ్గర నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన