వాషింగ్టన్ వేదికగా చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై యూఏఈ-ఇజ్రాయోల్ సంతకాలు
- September 16, 2020
అమెరికా:మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు సంబంధించి చారిత్రాత్మక ఘటనకు వాషింగ్టన్ వేదికగా నిలిచింది. గత నెలలో శాంతి పునరుద్ధరణ, దౌత్య సంబంధ ఒప్పందంపై అంగీకారం తెలిపిన ఇజ్రాయోల్, యూఏఈ...ఇప్పుడు దౌత్య ఒప్పందానికి సంబంధించి పరస్పరం సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా యూఏఈ విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మాట్లాడుతూ..ఈ శాంతి ఒప్పందం యూఏఈ, ఇజ్రాయోల్ మధ్య దౌత్య పురోభివృద్ధికి అలాగే మధ్య ప్రాచ్య దేశాల పురోభివృద్ధికి కూడా తోడ్పడుతుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అయితే..ఈ ఒప్పందం పాలస్తీనా హక్కులకు, దేశపరిరక్షణకు ఏ విధంగానూ ఆటంకం కలిగించబోదని ఆయన అన్నారు. పాలస్తీనాకు మునుపటి తరహాలో తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు అడుగులు పడుతున్న ప్రస్తుత సమయంలో పాలస్తీనా కూడా కొన్ని సానుకూల విధానాలతో ముందుకు రావాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!