ఆర్.జి.వి బయోపిక్ షూటింగ్ ప్రారంభం
- September 16, 2020
హైదరాబాద్: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఎన్నో బయోపిక్స్‌ను తెరకెక్కించి సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన బయోపిక్‌ను తెరమీద చూపించడానికి శ్రీకారం చుట్టారు. రామ్‌గోపాల్ వర్మ జీవితాన్ని మొత్తం మూడు భాగాలుగా సినిమా తీయనున్నారు. మూడు పార్ట్‌లలో ముగ్గురు వేరువేరు వ్యక్తులు రామ్‌గోపాల్‌వర్మ స్థానంలో కనిపించనున్నారు. అయితే మూడో పార్ట్‌లో మాత్రం రామ్ గోపాల్ వర్మే నటించనున్నారు.
ఇందుకు సంబంధించిన మొదటి పార్ట్ షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. దీనికి ‘రాము’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇందులో దొరసాయి తేజ అనే అతను నటిస్తున్నాడు. ఫస్ట్ షాట్‌కు రామ్ గోపాల్ వర్మ సోదరి క్లాప్ కొట్టిందని వర్మ ట్విట్టర్ ద్వారా ఆ ఫోటోలను పంచుకున్నారు. అదే విధంగా తేజ తన తల్లి వద్ద ఆశీర్వాదాలు తీసుకున్నాడని వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ట్విట్టర్‌లో షేర్ చేశారు. తేజకు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని వర్మ తెలిపారు. వర్మ బయోపిక్‌ను బొమ్మా మురళి నిర్మిస్తుండగా, వర్మ పర్యవేక్షణలో దొరసాయి తేజ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పార్ట్ 1లో రామ్ గోపాల్ కాలేజ్ డేస్ చూపించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?