మళ్లీ పెరిగిన పసిడి,వెండి ధరలు
- September 16, 2020
పసిడి, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన భేటీ నేపథ్యంలో బంగారం రేటు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో దేశీయ మార్కెట్లోనూ గోల్డ్ కొండెక్కుతుంది. ఎంసీఎక్స్‌లో మంగళవారం పదిగ్రాముల బంగారం 471 పెరిగింది. దీంతో 10 గ్రామాల బంగారం రూ.52158 రూపాయలకు చేరింది. ఇక కిలో వెండి 855 రూపాయలు ఎగబాకింది. 69,820 రూపాయలకు చేరింది. డాలర్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరిగినట్టు తెలుస్తోంది. ఇన్వెస్టర్లు గోల్డ్‌లో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో స్పాట్‌గోల్డ్ ఔన్స్ 1962.78 డాలర్లగా పెరిగింది. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇవాళ తీసుకునే నిర్ణయాలపై బంగారం ధరల భవిష్యత్తు ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







