కోవిడ్ 19 నియంత్రణ ఉత్పత్తుల స్మగ్లింగ్ లను అడ్డుకోవటంలో ఖతార్ కు ఫస్ట్ ప్లేస్

కోవిడ్ 19 నియంత్రణ ఉత్పత్తుల స్మగ్లింగ్ లను అడ్డుకోవటంలో ఖతార్ కు ఫస్ట్ ప్లేస్

దోహా:కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో పలు దేశాల్లో కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. కొన్ని దేశాలైతే ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో కోవిడ్ 19 నియంత్రణ వైద్య పరికరాలు, మాత్రలు, ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. అయితే..కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణ ఉత్పత్తులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోవటంతో ఇదే అదనుగా కొందరు అక్రమార్జన కోసం ఉత్పత్తులను బ్లాక్ మార్కెట్ చేస్తున్న విషయం తెలిసింది. కోవిడ్ 19 నియంత్రణ ఉత్పత్తులు ప్రజలకు అత్యవసరంగా మారిన ప్రస్తుత సమయంలో బ్లాక్ మార్కెట్ స్మగ్లర్లను నిరోధించటంలో ఖతార్ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. కోవిడ్ 19 నియంత్రణ ఉత్పత్తుల స్మగ్లింగ్ ను అడ్డుకోవటంలో ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో నిలిచినట్లు ఖతార్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బ్లాక్ మార్కెట్ దందా నిర్వాహకుల నుంచి పెద్ద మొత్తంలో క్రిమిసంహారక ఉత్పత్తులు, శానిటైజర్లు, మాస్కులను స్వాధీనం చేసుకుంది. 

Back to Top